ఓటర్లకు డబ్బు పంపిణీ.. కదిరిలో ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:42 AM
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కదిరి 44వ వార్డు పరిధిలోని కుటాగుళ్లలో వైసీపీ అభ్యర్థి అవేంద్రకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్న మురళీకృష్ణ, పి. వెంకటేశ్‌ను పట్టుకుని, రూ.30 వేలు, ఓటరు స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
కదిరి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కదిరి 44వ వార్డు పరిధిలోని కుటాగుళ్లలో వైసీపీ అభ్యర్థి అవేంద్రకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్న మురళీకృష్ణ, పి. వెంకటేశ్‌ను పట్టుకుని, రూ.30 వేలు, ఓటరు స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. 14 వార్డు పరిధిలోని మశానం పేటలో వైసీపీ అభ్యర్థి నల్లమాడ షేక్ అవేజ్ ఖర్నికి మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్న షాకీర్, సద్దాంను అదుపులోకి తీసుకున్నారు. రూ.34 వేలు నగదు, ఓటరు స్లిప్‌లు స్వాధీనం చేసుకున్నారు. 12వ వార్డు గాంధీనగర్‌లో వైసీపీ అభ్యర్థి పి. రుబీనాకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్న ఆమె భర్త మహమ్మద్ ఆలీని అదుపులోకి తీసుకుని, రూ.9 వేల నగదు, మూడు ఓటరు స్లిప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?