Share News

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: అచ్చెన్న

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:26 AM

కూటమి ప్రభుత్వ లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్యరంగంపై ఆధారపడిన కుటుంబాలకు శనివారం...

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: అచ్చెన్న
Minister Achchennaidu

అమరావతి: కూటమి ప్రభుత్వ లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్యరంగంపై ఆధారపడిన కుటుంబాలకు శనివారం ఓ ప్రకటనలో ఆయన ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.

‘200 యాంత్రిక పడవలను 60శాతం రాయితీతో మత్స్యకారులకు అందించే నిర్ణయాన్ని కార్యరూపంలోకి తెచ్చే చర్యలు తీసుకుంటున్నాం. శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు బీమా వర్తింపజేస్తున్నాం. ఆక్వా రైతులకు జోన్‌, నాన్‌జోన్‌ అనే పరిమితులు లేకుండా యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందించే నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 07:47 AM