Share News

విజయవాడ బస్టాండ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:38 PM

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్‌లోని డిపార్చర్ బ్లాక్‌లో ఉన్న ఏసీ మిషన్లలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

విజయవాడ బస్టాండ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..
PNBS Fire Accident

విజయవాడ, ఏప్రిల్ 26: నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (PNBS)లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్‌లోని డిపార్చర్ బ్లాక్‌లో ఉన్న ఏసీ మిషన్లలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్టాండ్‌లోని 48, 49, 50 నంబర్ ప్లాట్‌ఫారమ్‌ల వద్ద ఉన్న ఏసీ యూనిట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.


ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏసీల్లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పరిస్థితిని సమీక్షించారు.


ఈ వార్తలనూ చదవండి:

బద్దలైన అగ్ని పర్వతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు..

ఎండా కాలంలో కూల్ టెక్నిక్.. ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే..

Updated Date - Apr 26 , 2026 | 06:40 PM