Share News

ఆ కుటుంబాల్లో ఇద్దరూ గెలిచారు.. విజేతలు-విశేషాలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:50 AM

పరిషత్‌ ఎన్నికల్లో కొన్ని కుటుంబాల్లో ఇద్దరేసి విజయం సాధించారు. భార్యాభర్తలు, తోడికోడళ్లు, తల్లీకూతుళ్లు ఎన్నికల్లో గెలిచి డబుల్‌ ధమాకా కొట్టారు.

ఆ కుటుంబాల్లో ఇద్దరూ గెలిచారు.. విజేతలు-విశేషాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): పరిషత్‌ ఎన్నికల్లో కొన్ని కుటుంబాల్లో ఇద్దరేసి విజయం సాధించారు. భార్యాభర్తలు, తోడికోడళ్లు, తల్లీకూతుళ్లు ఎన్నికల్లో గెలిచి డబుల్‌ ధమాకా కొట్టారు.

  • అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఆలం వెంకట నరసానాయుడు బొందలవాడ ఎంపీటీసీగా, ఆయన భార్య శిరీష చామలూరు ఎంపీటీసీగా ఎన్నికయ్యారు.

  • శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మపురం నుంచి అన్నెపు రాము, ఆయన భార్య లక్ష్మీకుమారి బాణాం స్థానం నుంచి ఎంపీటీసీలుగా ఏకగ్రీవమయ్యారు.

  • ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు-3 నుంచి గజ్జి విజయలక్ష్మి, పెనుగంచిప్రోలు-4 నుంచి గజ్జి కృష్ణమూర్తి టీడీపీ తరపున గెలిచారు. వీరిద్దరూ భార్యాభర్తలు.

  • కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో భార్యాభర్తలు యాళ్ల మంగాదేవి (ప్రత్తిపాడు ఎంపీటీసీ-3), ఆమె భర్త యాళ్ల జగదీశ్‌ (ఎంపీటీసీ-2) టీడీపీ తరఫున గెలిచారు.

  • శ్రీకాకుళం జిల్లా కంచిలిలో టీడీపీ ఎంపీటీసీలుగా భార్య, భర్త గెలిచారు. శ్రీరాంపురం ఎంపీటీసీగా మాదిన విమల, కొక్కిలిపుట్టుగ ఎంపీటీసీగా ఆమె భర్త మాదిన రామారావు విజయం సాధించారు.

  • వమరవెల్లి-1 ఎంపీటీసీ స్థానం నుంచి భార్యాభర్తలు లోపింటి రాధాకృష్ణ, వమరవెల్లి-2 నుంచి లోపింటి భవానీ టీడీపీ తరఫున విజయం సాధించారు.


  • శ్రీకాకుళం జిల్లా జలుమూరు జడ్పీటీసీగా టీడీపీ నుంచి పంచిరెడ్డి రామచంద్రరావు, ఆయన అన్న పంచిరెడ్డి త్రినాధరావు చల్లవానిపేట నుంచి ఎంపీటీసీగా గెలిచారు.

  • పలాస మండలంలో లక్ష్మీపురం ఎంపీటీసీగా దువ్వాడ వనజాక్షి, ఆమె కొడుకు దువ్వాడ సంతోష్ కుమార్ పలాస జడ్పీటీసీగా విజయం సాధించారు.

  • పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎంపీటీసీలుగా తల్లీకూతుళ్లు గెలిచారు. డోలమడ ఎంపీటీసీడి కర్నేన యోగిత, వాటపాగు నుంచి ఆమె కుమార్తె పద్మిని ప్రియదర్శిని గెలిచారు. ప్రియదర్శిని ఎంబీబీఎస్‌ చదువుతున్నారు.

  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జడ్పీటీసీగా తమ్మినేని సుజాత (టీడీపీ) గెలుపొందగా, ఆమె తల్లి భారతమ్మ (టీడీపీ) కలివరం ఎంపీటీసీ స్థానం నుంచి నెగ్గారు.

  • పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో టీడీపీ తండ్రి, కూతురు ఎంపీటీసీలుగా గెలిచారు. మాతుమూరు ఎంపీటీసీగా గూడేపు యుగంధర్‌, పాంచాలి నుంచి కుమార్తె కావ్య గెలిచారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 02:56 AM