నకిలీ మద్యం అంటూ ప్రచారం.. ఖండించిన ఎక్సైజ్
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:53 AM
షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నారంటూ మంగళగిరిలో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారానికి దిగారు.
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నారంటూ మంగళగిరిలో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారానికి దిగారు. మంగళగిరిలోని ఓ షాపులో కొనుగోలు చేసిన మద్యం సీసాపై ఎక్సైజ్ సురక్ష యాప్‌తో స్కాన్ చేసి ఎర్రర్ వస్తోందని చూపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎక్సైజ్ శాఖ తనిఖీ చేయగా వినియోగదారుడు సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడానికి బదులుగా కింద భాగంలో సురక్ష యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి అని సూచించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లు గుర్తించారు. దీంతో నకిలీ మద్యం అని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిని ఎక్సైజ్ అధికారులు ఖండించారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ