వసతి గృహంలో విషాదం.. కరెంట్ షాక్‌తో విద్యార్థిని మృతి
ABN , Publish Date - Aug 07 , 2026 | 09:51 AM
ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం శివాకాశీపురం బాలికల వసతి గృహంలో కిటికీపై బట్టలు ఆరేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురైన ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది.
ఏలూరు, ఆగస్టు 7: జిల్లాలోని వేలేరుపాడు మండలం శివాకాశీపురం బాలికల వసతి గృహంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న కేచ్చేల లక్ష్మిపార్వతి (13) కిటికీపై బట్టలు ఆరేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. ఒక్కసారిగా షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే గమనించిన తోటి విద్యార్థినులు, వసతి గృహ సిబ్బంది ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వసతి గృహంలో విద్యుత్ భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయా? విద్యుత్ షాక్ ఎలా ఏర్పడింది? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి...
బోఫోర్స్ కేసు.. చివరి పిటిషన్‌నూ కొట్టేసిన సుప్రీం కోర్టు
ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం
Read Latest AP News And Telugu News