Share News

ముసాయిదా జాబితాలోని ఏఎస్‌డీడీ అర్హులందరికీ మరో అవకాశం

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:52 AM

సర్‌ ప్రక్రియలో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని ఎస్‌ఈసీ వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

ముసాయిదా జాబితాలోని ఏఎస్‌డీడీ అర్హులందరికీ మరో అవకాశం

  • 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణ: ఎస్‌ఈసీ

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని ఎస్‌ఈసీ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గైర్హాజరైన వారు(అబ్‌సెంట్‌), చిరునామా మార్పు(పర్మినెంట్‌ షిప్టెడ్‌), మరణం(డెత్‌), ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండడం(డూప్లికేట్‌) వంటి కారణాలతో(ఏఎస్‌డీడీ) జాబితాలో ఉన్న అర్హులైన ఓటర్లను గుర్తించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి 20లోగా తుది ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలి. 30న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తాం.

ముసాయిదా జాబితాల్లో పేర్లు లేని వారు బీఎల్‌వోలు ఇచ్చే ఎన్యుమరేషన్‌ ఫారం తిరిగి ఇస్తే సరిపోతుంది. ఫారం-6 దరఖాస్తు చేయనవసరంలేదు. ఏఎస్‌డీడీ కేటగిరీ కింద నమోదైన ఓటర్లకు వాట్సాప్‌, ఈమెయిల్‌తోపాటు ఆయా బూత్‌ లెవల్‌ అధికారులు నేరుగా ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాలను అందజేసి తిరిగి తీసుకుంటారు. ఓటర్ల తుది జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికి చోటు కల్పించాలి’ అని వివేక్‌ ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 12:55 AM