500 మందికి 50 ఇడ్లీలే
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:17 AM
ఎన్నికల విధుల కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, సోంపేట, పలాస మండలాల నుంచి శనివారం సరుబుజ్జిలి వచ్చిన 500 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి టిఫిన్ కోసమంటూ కేవలం 50 ఇడ్లీలను...
సరుబుజ్జిలిలో ఎన్నికల సిబ్బంది ఆందోళన
సరుబుజ్జిలి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, సోంపేట, పలాస మండలాల నుంచి శనివారం సరుబుజ్జిలి వచ్చిన 500 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి టిఫిన్ కోసమంటూ కేవలం 50 ఇడ్లీలను అధికారులు తెప్పించడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనానికి అన్నం, రసం మాత్రమే ఇచ్చారు. తాగునీరు కూడా సమకూర్చలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సరుబుజ్జిలి-పాలకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..