Share News

ఎల్‌నినోతో వచ్చే మార్చి వరకు కరువు!

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:18 AM

తీవ్రమైన ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావం కొనసాగింది.

ఎల్‌నినోతో వచ్చే మార్చి వరకు కరువు!

విశాఖపట్నం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తీవ్రమైన ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావం కొనసాగింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగనున్నది. ఎల్‌నినో సంవత్సరాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయని చరిత్ర చెబుతోంది. దేశంలో 1871 నుంచి 2026 వరకు... 155 ఏళ్లలో 27సార్లు అత్యంత తీవ్రమైన కరువు నెలకొందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ పేర్కొంది. అదే 1950 తరువాత పదిహేనుసార్లు కరువు వచ్చింది. 1972, 2009 సంవత్సరాల్లో అత్యంత దారుణమైన కరువు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ఇప్పటివరకు ఐదు పర్యాయాలు మాత్రం సంవత్సరం విడిచి సంవత్సరం కరువు సంభవించినట్టు స్కైమెట్‌ వెల్లడించింది. కాగా, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:18 AM