భారతి, దాల్మియా సిమెంట్స్ కేసుల్లో ఫిర్యాదులకు ఈడీ సవరణ!
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:57 AM
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో గతంలో దాఖలుచేసిన రెండు ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను తాజాగా సవరించి మళ్లీ కోర్టుకు సమర్పించడానికి ఈడీ సన్నద్ధమవుతోంది.
ప్రత్యేక కోర్టులో తాజాగా దాఖలుకు రెడీ
హైదరాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో గతంలో దాఖలుచేసిన రెండు ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను తాజాగా సవరించి మళ్లీ కోర్టుకు సమర్పించడానికి ఈడీ సన్నద్ధమవుతోంది. భారతి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కేసులకు సంబంధించి గతంలో ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదుల్లో కొన్ని సాంకేతిక, న్యాయపరమైన లోపాలు ఉండడంతో ప్రత్యేక న్యాయస్ధానం వాటిని తిప్పిపంపింది. ఇదే క్రమంలో దాల్మియా సిమెంట్స్ కేసులో పీఎంఎల్ఏ చట్టం ప్రకారం నేరార్జన రూ.793.34 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చిలో అప్పిలేట్ ట్రైబ్యునల్ దానిని రూ.92.52 కోట్లకు తగ్గించింది.
ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ వంటి ప్రత్యామ్నాయ భద్రత కల్పించేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో ఈడీ తాజాగా ప్రాసిక్యూషన్ ఫిర్యాదును తిరిగి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక భారతి సిమెంట్స్ కే సు లో గనుల లీజు అంశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడంతో.. ఈ కేసులోనూ సవరించిన అంశాలతో ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేయనున్నట్లు సమాచారం. సవరించిన ఫిర్యాదులు కోర్టు ముందుకు చేరిన తర్వాత విచారణ వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. సీబీఐ కోర్టు ఈడీ కేసులను రోజువారీ విచారణకు అనుమతించడంతో డిశ్చార్జ్ పిటిషన్లపై త్వరగా నిర్ణయం వెలువడుతుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రాసిక్యూషన్ అనుమతులు తెప్పించుకోవడానికి కృషిచేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు