Share News

సోదాల్లో ప్రాథమిక ఆధారాలు లభ్యం

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:01 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కీలక ప్రకటన చేసింది.

సోదాల్లో ప్రాథమిక ఆధారాలు లభ్యం

  • గ్రూప్‌-1 మూల్యాంకనం అక్రమాల కేసులో ఈడీ ప్రకటన

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కీలక ప్రకటన చేసింది. మాన్యువల్‌ మూల్యాంకనం పేరుతో ప్రైవేటు సంస్థకు రూ.1,14,32,312 చెల్లించిన వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలు లభించినట్లు వెల్లడించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తుచేస్తున్న ఈ కేసులో.. బుధవారం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, గుంటూరు ప్రాంతాల్లో మొత్తం ఏడు చోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:01 AM