Share News

కాపులను వైసీపీ వినియోగించుకుంది... గౌరవించలేదు: సోమువీర్రాజు

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:40 PM

ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు.

కాపులను వైసీపీ వినియోగించుకుంది... గౌరవించలేదు: సోమువీర్రాజు
Somu Veerraju

రాజమండ్రి, జూన్ 24: ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. బొత్స సత్యనారాయణకు వైసీపీలో విలువ లేకుండా చేశారని అన్నారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరంలో ఆయన మేనల్లుడు శ్రీనివాస్‌ను దింపారన్నారు. శ్రీనివాస్‌ను విజయసాయిరెడ్డి ఎంకరేజ్‌ చేశారని చెప్పారు. కాపులను వైసీపీ వినియోగించుకుందని... గౌరవించలేదని విమర్శించారు.


కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వబోమని జగన్‌ చెప్పడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. జగన్‌ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సమావేశాలు పెట్టి కాపులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. కాపులని చెప్పటానికి ఎవరూ భయపడక్కరలేదని అన్నారు. కాపులకు టీడీపీ సముచిత స్థానం ఇస్తోందని సోమువీర్రాజు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణది కస్టోడియల్ డెత్.. రిమాండ్ రిపోర్ట్‌లో నిర్ధారించిన సిట్

ఒకప్పుడు KGF.. ఇప్పుడు JGF: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 04:53 PM