వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రశ్నించిన సిట్
ABN , Publish Date - Mar 16 , 2026 | 06:30 PM
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. తొలి రోజు జరిగిన ఈ విచారణ దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది.
కాకినాడ: జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. తొలి రోజు జరిగిన ఈ విచారణ దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది.
సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించిన అంశాలపై లక్ష్మిదుర్గను ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఇద్దరు మహిళా ఎస్సైలు ఆమె స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. అదే సమయంలో లక్ష్మిదుర్గ ఇచ్చిన సమాధానాలను సిట్ అధికారులు వీడియో రూపంలో కూడా నమోదు చేశారు.
ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరుకావాలని లక్ష్మిదుర్గకు కోర్టు ఆదేశించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే పలువురు వ్యక్తులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం
జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్