ఏపీలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారులకు తీవ్రగాయాలు..
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:02 PM
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మత్స్యకారుల బోటు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్యపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.
కాకినాడ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మత్స్యకారుల బోటు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు బోటు ప్రమాదాల్లో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కాగా.. మరో 10 మందిని సురక్షితంగా కాపాడారు. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్యపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఎరుపల్లి కోటేష్, ఎరుపల్లి ప్రసాద్ సహా పలువురు చేపల వేటకు వెళ్లారు.
సముద్రంలో సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లారు. అయితే, భోజనం వండుకునేందుకు గ్యాస్ స్టవ్ ఆన్ చేశారు మత్స్యకారులు. ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగి బోటుకు అంటుకున్నాయి. కొద్దిసేపటికే పడవ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కోటేష్, ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పడవ నుంచి అందరూ దూకేశారు. గమనించిన వేరే బోటులోని మత్స్యకారులు హుటాహుటిన వారి వద్దకు చేరుకుని అందరినీ రక్షించారు. అనంతరం బాధితులను తునిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.
ఇవి కూడా చదవండి...
ఇక నుంచి మీ సంగతి చూస్తాం... కొడాలి నానికి బుద్దా వెంకన్న వార్నింగ్
కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్