Share News

గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం..

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:21 AM

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీ యత్నం కలకలం రేపింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు బోగి తాళం పగులగొట్టి యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం చేశారు.

గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం..
Kakinada Urea Theft

కాకినాడ: సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీ యత్నం కలకలం రేపింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు బోగి తాళం పగులగొట్టి యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం చేశారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వైపుగా రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


గూడ్స్ రైలు ఉండూరు గేటు వద్దకు రాగానే వేరే రైళ్లు వెళ్లేందుకు గేటును మూసేశారు రైల్వే సిబ్బంది. దీంతో సిగ్నల్ కోసం వేచి చూస్తుండగా.. కొందరు దుండగులు ఒక బోగి తాళం పగులగొట్టారు. అందులోని యూరియా బస్తాలను దొంగిలించడం మెుదలుపెట్టారు. ఇది గమనించిన రైలు సిబ్బంది వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.


అనంతరం తనిఖీలు చేపట్టి సమీప పొలంలో దాచిన 60 యూరియా బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడులో భారీ విధ్వంసం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు, సామగ్రి

ఖతార్‌లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు..

Updated Date - Jun 22 , 2026 | 11:28 AM