700 కోట్ల పెట్టుబడులకు డిక్సన్ సుముఖత
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:55 AM
తిరుపతి-ఈఎంసీ జోన్ 3లో కొత్తగా రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పంకజ్ శర్మ సుముఖత వ్యక్తంచేశారు
మంత్రి లోకేశ్‌తో సంస్థ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ భేటీ
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి-ఈఎంసీ జోన్ 3లో కొత్తగా రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పంకజ్ శర్మ సుముఖత వ్యక్తంచేశారు. విశాఖలో మంత్రి లోకేశ్‌తో భేటీ అనంతరం ఈ పెట్టుబడిని ప్రకటించారు. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కొప్పర్తి, తిరుపతిలో విస్తరణ ప్రణాళికలను రూపొందించడంపై డిక్సన్‌కు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. పంకజ్ శర్మ మాట్లాడుతూ.. కడప జిల్లా కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ (సీపీ ప్లస్)ను రూ. 450 కోట్లతో విస్తరిస్తున్నామని, దీని ద్వారా 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్