Share News

పీఆర్సీ చైర్మన్‌ నియామకంపై హర్షం

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:40 AM

పీఏసీ చైర్మన్‌గా దినేశ్‌ కుమార్‌ను నియమించడం పట్ల ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ హర్షం వ్యక్తం చేశారు.

పీఆర్సీ చైర్మన్‌ నియామకంపై హర్షం

  • చంద్రబాబుకు ధన్యవాదాలు: ఏపీ జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): పీఏసీ చైర్మన్‌గా దినేశ్‌ కుమార్‌ను నియమించడం పట్ల ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ హర్షం వ్యక్తం చేశారు. దినేశ్‌ కుమార్‌ నియామకంతో వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైందని విద్యాసాగర్‌ గురువారం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 25 రోజుల్లోనే చైర్మన్‌ నియామకంపై ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆర్థిక మంత్రి కేశవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు తమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పీఆర్సీ చైర్మన్‌ నియామకంతో వేతన సవరణకు సంబంధించిన తదుపరి కార్యాచరణ త్వరితగతిన ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామని విద్యాసాగర్‌ పేర్కొన్నారు. నాలుగు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రభుత్వం ఎడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్‌ను పునరుద్ధరించడం వల్ల ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అదేవిధంగా హెల్త్‌ కార్డు అంశంలో కూడా ప్రతి నెల ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌కు రూ.36 కోట్లు జమ చేయడం వల్ల హెల్త్‌కార్డులపై నాణ్యమైన సేవలు అందించడానికి వీలుపడుతుందన్నారు. అదేవిధంగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యాసాగర్‌ కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:41 AM