‘ఢీ 10’ విజేత రాజు అరెస్టు
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:28 AM
తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ‘ఢీ 10’ డ్యాన్స్ షో విజేత రాజు అరెస్టు అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజు తనని లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఈ నెల 9 హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మియాపూర్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ‘ఢీ 10’ డ్యాన్స్ షో విజేత రాజు అరెస్టు అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజు తనని లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఈ నెల 9 హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకున్న పోలీసులు రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి