దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తా
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:56 AM
దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తానని, క్షేత్రస్థాయిలో వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పారు.
క్షేత్రస్థాయి సమస్యలపై స్వయంగా అధ్యయనం
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెల్లడి
ఉప్పాడ రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
బీచ్ రోడ్‌ను వెంటనే పునరుద్ధరించాలని నిర్దేశం
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తానని, క్షేత్రస్థాయిలో వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి కాకినాడ జిల్లాలో తుఫాన్ ప్రభావం, సహాయ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్చువల్‌గా తీర ప్రాంత గ్రామాల ప్రజలతో మాట్లాడి, తుఫాన్ కారణంగా జరిగిన నష్టం, సహాయ చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ, ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి డిజైన్, డీపీఆర్ పనులు వేగవంతం చేయాలన్నారు.
కోనపాపపేట వరకు గోడ పొడిగింపుపై విపత్తు నిర్వహణశాఖ ఆమోదం తీసుకోవాలని సూచించారు. అలలకు దెబ్బతిన్న ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం పనితీరును మెచ్చుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో విద్యుత్ ఇబ్బందులను పరిష్కరించాలని చెప్పారు. దెబ్బతిన్న ఇళ్లు, బోట్లు, వలలు, పంటలు, మగ్గాల నష్టంపై అంచనాలు రూపొందించాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?