ఇది వాగు కాదు.. రోడ్డే!
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:23 AM
ఈ చిత్రంలో కనిపిస్తోంది వాగు అనుకుంటే పొరబడినట్లే! నెల్లూరు జిల్లా కలువాయి మండల పరిధిలోని పొదలకూరు-సోమశిల మెయిన్ రోడ్డు ఇది. వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో రోడ్డు దారుణంగా దెబ్బతిని ఇలా నీరు నిలిచి, వాగును తలపిస్తోంది.
ఈ చిత్రంలో కనిపిస్తోంది వాగు అనుకుంటే పొరబడినట్లే! నెల్లూరు జిల్లా కలువాయి మండల పరిధిలోని పొదలకూరు-సోమశిల మెయిన్ రోడ్డు ఇది. వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో రోడ్డు దారుణంగా దెబ్బతిని ఇలా నీరు నిలిచి, వాగును తలపిస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో అర కిలోమీటరు మేర రోడ్డు దెబ్బతిని, భారీ వాహనాలు ఇరుక్కుపోతుండటంతో రోజుల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయేది. కార్లు, ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉండేవి. ప్రభుత్వం ఏడాది క్రితం రూ.40 లక్షలతో రెండు కల్వర్టులు, 130 మీటర్ల మేర సిమెంటు రోడ్డు, 100 మీటర్లు తారు రోడ్డును మంజూరు చేసింది. అయితే కాంట్రాక్టర్ రెండు కల్వర్టులు, సిమెంట్ రోడ్డు మాత్రం నిర్మించి తారు రోడ్డు వేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. అధికారుల కూడా మిన్నకుండిపోయారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- కలువాయి, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం