Share News

10న అర్నబ్‌ తుఫాన్‌ పంట నష్టం తుది జాబితా

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:46 AM

అర్నబ్‌ తుఫాన్‌ పంట నష్టంపై అంచనాలను ఈ నెల 6వ తేదీ నాటికి పూర్తి చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ క్షేత్రస్థాయి అధికారులను ఆదివారం ఆదేశించారు

10న అర్నబ్‌ తుఫాన్‌ పంట నష్టం తుది జాబితా
AP Govt

  • ఒక్కో రైతు 5 ఎకరాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీకి అర్హత: వ్యవసాయశాఖ

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ పంట నష్టంపై అంచనాలను ఈ నెల 6వ తేదీ నాటికి పూర్తి చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ క్షేత్రస్థాయి అధికారులను ఆదివారం ఆదేశించారు. తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 7, 8, 9 తేదీల్లో రైతుసేవా కేంద్రాల్లో ప్రదర్శించాలని సూచించారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి బృందాలతో ధ్రువీకరించిన తర్వాత ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన ప్రతిపాదనలు, రైతుల వివరాలతో పాటు తుది జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ నెల 10లోగా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌కు సమర్పించాలన్నారు. కాగా, ఒక పంట కాలంలో పలుమార్లు నష్టం జరిగినా, ఒకే రైతు వేర్వేరు ప్రాంతాల్లో సాగు చేసినా.. మొత్తం నష్టం విస్తీర్ణం ఒక్కో రైతు రెండు హెక్టార్ల(5 ఎకరాలు)కు ఇన్‌పుట్‌ సబ్సిడీ పొందటానికి అర్హులని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం

Updated Date - Nov 02 , 2026 | 01:50 AM