Share News

కోట్లు పలుకుతున్న ఏకగ్రీవాలు!

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:20 AM

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రామపంచాయతీల ఏకగ్రీవాలు రూ.కోట్లు పలుకుతున్నాయి.

కోట్లు పలుకుతున్న ఏకగ్రీవాలు!
elections

భోగాపురం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రామపంచాయతీల ఏకగ్రీవాలు రూ.కోట్లు పలుకుతున్నాయి. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం సమీపంలో భోగాపురం ఉండడంతో ఈసారి సర్పంచ్‌ స్థానాలకు గిరాకీ ఏర్పడింది. గ్రామాభివృద్ధి పేరుతో సర్పంచ్‌ పదవులకు వేలం పాటలు నిర్వహిస్తూ ఏకగ్రీవాలకు సన్నాహాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని బైరెడ్డిపాలెం, ముంజేరు పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు రూ.2.8కోట్ల కు ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమీపంలోని బైరెడ్డిపాలెం సర్పంచ్‌ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు రూ.1.5 కోట్లు, ముంజేరులో రూ.1.3 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ముంజేరులో యువత ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతోంది.

ఇవి కూడా చదవండి..

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్

Updated Date - Nov 17 , 2026 | 05:18 AM