Share News

ఎన్నికల ప్రక్రియలో దౌర్జన్యాలు: సీపీఐ

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:37 AM

‘గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పక్రియలో దౌర్జన్యాలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో దౌర్జన్యాలు: సీపీఐ

విజయవాడ(గాంధీనగర్‌), అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పక్రియలో దౌర్జన్యాలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూటమి నాయకులు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. నామినేషన్‌ పత్రాలను బహిరంగంగా చింపివేస్తున్నారు. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై ఎన్నికల సంఘం తగినవిధంగా స్పందించడం లేదు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి మాయని మచ్చ’ అని రామకృష్ణ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:37 AM