Share News

సోనియా అనేక అవమానాలు భరించారు

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:15 AM

తన జీవిత ప్రయాణం, రాజీవ్‌గాంధీతో ఉన్న ప్రేమానుబంధం, కుటుంబ బాధ్యతలు, రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వ్యక్తిగత విషాదాలను కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాసిన పుస్తకంలో వివరించారని....

సోనియా అనేక అవమానాలు భరించారు

  • దేశ ప్రజలతో అనుబంధం పెంచుకున్నారు

  • పుస్తకాన్ని చదవకుండానే విమర్శలు తగవు

  • సోనియా ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు

విజయవాడ(గాంధీనగర్‌), నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తన జీవిత ప్రయాణం, రాజీవ్‌గాంధీతో ఉన్న ప్రేమానుబంధం, కుటుంబ బాధ్యతలు, రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వ్యక్తిగత విషాదాలను కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాసిన పుస్తకంలో వివరించారని పలువురు వక్తలు తెలిపారు. తన జీవితంలో సోనియా అనేక అవమానాలు భరించారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ రచించిన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకావిష్కరణ, సమీక్ష కార్యక్రమం విజయవాడలో శనివారం జరిగింది.

ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేత గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశం, ప్రజాస్వామ్యం కోసం సోనియాగాంధీ రాజకీయాల్లో కొనసాగినట్టు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పుస్తకాన్ని పూర్తిగా చదవకుండానే విమర్శించడం సరైందికాదన్నారు. సోనియాగాంధీ రాసిన పుస్తకంపై సోషల్‌ మీడియాలో చేస్తున్న అనుచిత వాఖ్యలను ఖండించారు. సీపీఎం రాష్ట్రనేత సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై తన అభిప్రాయాలను సోనియాగాంధీ ఈ పుస్తకంలో వెల్లడించారన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రఘువీరారెడ్డి మాట్లాడుతూ 22 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో ఉండి సోనియా అనేక విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడు టి.మనోహర్‌ నాయుడు, ఏపీ ప్రింటర్స్‌ నాయకులు గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 01:17 AM