Share News

కోస్తాంధ్రకు 4 రోజులు భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:19 AM

ఉత్తర అండమాన్‌ సముద్రంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. 23న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కోస్తాంధ్రకు 4 రోజులు భారీ వర్షాలు

  • ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం

  • రేపటికి వాయుగుండంగా, 22కు మరింత తీవ్రంగా

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉత్తర అండమాన్‌ సముద్రంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. 23న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం నుంచి కోస్తాలో వర్షాలు పెరుగుతాయని, పలుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 4 రోజులు కోస్తాంధ్రలో భారీవర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాలని సూచించింది. కాగా, కోస్తా, సీమల్లో శనివారం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల వర్షాలు కురిశాయి.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 04:19 AM