Share News

శ్రుతిమించుతున్న వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:01 AM

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాకు కూటమి పార్టీ నేతల ప్రతినిధి బృందం శనివారం ఫిర్యాదు చేసింది.

శ్రుతిమించుతున్న వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలు

  • ఆ పార్టీ గుర్తింపు రద్దుకు ఈసీఐకి లేఖ రాయండి

  • ఎస్‌ఈసీకి కూటమి నేతల బృందం విజ్ఞప్తి

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాకు కూటమి పార్టీ నేతల ప్రతినిధి బృందం శనివారం ఫిర్యాదు చేసింది. ప్రకాశం, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సాగించిన దాడులు, విధ్వంసాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ నేత పాతూరి నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌ బాబు, నీలాయపాలెం విజయ్‌ కుమార్‌, తదితరులతో కూడిన బృందం ఎన్నికల కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది.

వైసీపీ విధ్వంసానికి సంబంధించిన వీడియో ఆధారాలతో కూడిన పెన్‌ డ్రైవ్‌ను ఎన్నికల కమిషనర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ‘నేరపూరిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్న వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాం’ అని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌ బాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేమని నిర్ణయించుకున్న వైసీపీ నేతలు ప్లాన్‌ ప్రకారమే గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 06:01 AM