రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్..
ABN , Publish Date - Mar 26 , 2026 | 08:38 PM
రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస అగ్ని ప్రమాదాల గురించి మంత్రి నారాయణను ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస అగ్ని ప్రమాదాల గురించి మంత్రి నారాయణను ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. వరుస అగ్నిప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో, విచారణ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖపై ఉందన్నారు (Amaravati fire accidents).
పైపులు ఎలా దగ్ధమయ్యాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అగ్నిప్రమాదాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు (AP CM serious on fires). రాజధానిలో రూ.వేల కోట్ల పనులు జరుగుతుంటే, ఇలాంటి ప్రమాదాలు జరగడం మంచిది కాదన్నారు. కనీసం సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కుట్రలు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్