Share News

30 ఏళ్ల క్రితం.. ‘హరికేన్‌’లో ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు: సీఎం

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:46 AM

‘సరిగ్గా 30 సంవత్సరాల కిందట 1996 నవంబరు 6న కోనసీమలో హరికేన్‌ తుఫాన్‌ సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి ఇక్కడకు వచ్చాను. ఆరోజున విమానంలో రాజమహేంద్రవరం వచ్చి..

30 ఏళ్ల క్రితం.. ‘హరికేన్‌’లో ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు: సీఎం

అమలాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ‘సరిగ్గా 30 సంవత్సరాల కిందట 1996 నవంబరు 6న కోనసీమలో హరికేన్‌ తుఫాన్‌ సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి ఇక్కడకు వచ్చాను. ఆరోజున విమానంలో రాజమహేంద్రవరం వచ్చి.. హెలికాప్టర్‌లో కోనసీమకు బయల్దేరుతున్నప్పుడు సైన్యాధికారులు సైతం నన్ను వద్దని వారించారు. నా ప్రాణానికి ముప్పు వస్తుందన్నారు. అయితే నా ప్రాణానికి నేనే హామీ అని, రాసిస్తానని చెప్పి ధైర్యంగా హెలికాప్టర్‌లో ఇదే (కాట్రేనికోన) మండలంలోని తీర గ్రామాలకు ధైర్యంగా వచ్చాను. రోడ్డు మీదే హెలికాప్టర్‌ను ల్యాండ్‌చేశాం. ఈ ప్రాంతాల్లో జరిగిన అప్పటి ప్రాణ నష్టాన్ని కళ్లారా చూశాను.

తర్వాత ముమ్మిడివరం, అమలాపురంలో పర్యటించాక రాజమహేంద్రవరం వెళ్లాను. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లే మార్గం లేకపోవడంతో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లాను. మొత్తం హైదరాబాద్‌లో ఉన్న సెక్రటేరియట్‌ను రాజమహేంద్రవరం రప్పించి ఆనాడు కోనసీమ విపత్తులో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు కృషి చేశాను.’ అంటూ నాటి ఘటనలను సీఎం ప్రస్తావించారు.

నేడు మొగల్తూరుకు సీఎం..

అర్నబ్‌ తుఫాన్‌తో అతలాకుతలమైన పశ్చిమ గోదావరి జిల్లా రైతులు, ప్రజలను పరామర్శించి నష్టం పరిశీలించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం మొగల్తూరు రానున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:46 AM