Share News

అమ్మా.. మీరు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:25 AM

పంచాయతీ ఎన్నికల్లో 108 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్‌ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవడం స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

అమ్మా.. మీరు స్ఫూర్తిదాయకం

  • 108 ఏళ్ల వృద్ధురాలు ఓటుహక్కు వినియోగంపై చంద్రబాబు ట్వీట్‌

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో 108 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్‌ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవడం స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘అమ్మా.. 108 ఏళ్ల వయసులోనూ మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. మీ అంకితభావం ప్రతి తరానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం యొక్క అసలైన అందం ఇదే’ అని ఆ వృద్ధురాలిని ఉద్దేశిస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 03:29 AM