Share News

డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పురాదు

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:19 AM

డేటా సెంటర్లతో పర్యావరణానికి వచ్చే ముప్పేం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ఫైర్‌ సైడ్‌ చాట్‌లో ఈ అంశాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ పాల్కీ శర్మ ప్రస్తావించగా,

డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పురాదు

  • నీటి వినియోగంలోనూ సమస్యలు ఉండవు

  • సీనియర్‌ జర్నలిస్టు పాల్కీ శర్మకు ఇంటర్వ్యూలో సీఎం స్పష్టీకరణ

డేటా సెంటర్లతో పర్యావరణానికి వచ్చే ముప్పేం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ఫైర్‌ సైడ్‌ చాట్‌లో ఈ అంశాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ పాల్కీ శర్మ ప్రస్తావించగా, ఆయన ఇలా స్పందించారు. డేటా సెంటర్ల రావడం వల్ల నీటి వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నాయనేది వాస్తవం కాదని సీఎం అన్నారు. ‘‘ఏటా మూడు వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. పోలవరం ఎడమ కాల్వ ద్వారా విశాఖకు వంద టీఎంసీల నీటిని తెచ్చే అవకాశం ఉంది. విశాఖలో పెడుతున్న డేటా సెంటర్లకు అందులో 3.5 టీఎంసీల నీటిని వినియోగిస్తాం.’’ అని చంద్రబాబు వివరించారు.

పార్టీలతో పొత్తుల అంశంపై ప్రశ్నించగా, 1991కు ముందు లెఫ్ట్‌ వింగ్‌, రైట్‌ వింగ్‌ అనే విధానాలు ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీనే సరైన ఛాయిస్‌ అని... ఆయనే రైట్‌ పర్సన్‌ అని స్పష్టం చేశారు. ‘సర్‌ వివాదంపై స్పందిస్తూ.. ఓటు పోయిందనే ఫిర్యాదు ఏపీలో రాలేదన్నారు. రాజకీయంగా కానీ.. పాలన పరంగా కానీ చేసిన అంచనాలు తప్పిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించగా, రాజకీయం, పాలనా వ్యవహరాల మధ్య సమతౌల్యం తప్పడంవల్ల గతంలో ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:19 AM