Share News

అక్కడ విద్యార్థే... టీచరమ్మ!

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:12 AM

నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేటలో ఉన్న నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని టీచరమ్మగా మారి పాఠాలు చెబుతోంది.

అక్కడ విద్యార్థే... టీచరమ్మ!

నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేటలో ఉన్న నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని టీచరమ్మగా మారి పాఠాలు చెబుతోంది. ఈ స్కూలులో 1 నుంచి 5 తరగతులు ఉండగా, 49 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు తరగతులకూ ఒక్క టీచరే ఉన్నారు. గత నెలలో కాంట్రాక్టు పద్ధతిలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ను తీసుకున్నారు. అదే సమయంలో ఉన్న ఒక్క టీచర్‌ ప్రసూతి సెలవు పెట్టారు. ఆమె స్థానంలో మరో ఉపాధ్యాయుడిని కేటాయించినా ఆయన గురువారం పాఠశాలకు రాలేదు. దీంతో 1,2 తరగతులకు ఐదో తరగతి విద్యార్థిని పాఠాలు చెబుతుండగా, 3,4,5 తరగతులకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ బోధిస్తున్నారు.

- నెల్లూరు క్రైం, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 05:12 AM