Share News

DSC: డబ్బుతో కాదు.. ప్రతిభతో సాధించాం

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:57 AM

డబ్బుతో కాదు.. కష్టపడి చదివి, మెరిట్‌ ఆధారంగా ఉద్యోగం సాధించాం’ అని మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత స్పష్టంచేశారు.

DSC: డబ్బుతో కాదు.. ప్రతిభతో సాధించాం
సమావేశంలో మాట్లాడుతున్న మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత

శ్రీరంగరాజపురం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): డబ్బుతో కాదు.. కష్టపడి చదివి, మెరిట్‌ ఆధారంగా ఉద్యోగం సాధించాం’ అని మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత స్పష్టంచేశారు. శ్రీరంగరాజపురం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణంలో సోమవారం సాయం త్రం 5 గంటలకు నియోజకవర్గంలో మెగా డీఎస్సీలో ఎంపికైన వారితో పాటు ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే థామస్‌ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నామని చెప్పారు. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలను ప్రతిపక్షం గుర్తుంచుకోవాలని సూచించారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్నారు. 2003వ సంవత్సరం ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విఽధానాన్ని అమలు చేశారని గణపతి నాయుడు తెలిపారు. ఉపాఽధ్యాయుల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్‌ థామస్‌ మాట్లాడుతూ, డీఎస్సీ నియమకాల్లో రూ.25లక్షలు తీసుకున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమనకరుణాకరణ్‌రెడ్డి,మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇన్‌చార్జి కృపాలక్ష్మి నిరూపిస్తే తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. ‘మీ ఐదేళ్లపాలనలో ఒక్క టీచరు పోస్టూ భర్తీ చేయలేదు. ఉపాధ్యాయులను మధ్యం షాపులవద్ద కాపలా పెట్టారు. ఇప్పుడేమో భావితరాన్ని నిర్మించే ఉపాధ్యాయులపై ఆరోపణలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయులే మీకు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు. ఎంఈవోలు సబర్మతి (ఎస్‌ఆర్‌పురం), గుణశేఖర్‌ (జీడీనెల్లూరు), భాస్కర్‌ నాయుడు (పెనుమూరు), విజయకుమార్‌ (కార్వేటినగరం), రాజేంద్రప్రసాద్‌ (పాలసముద్రం), టీడీపీ మండలాధ్యక్షుడు గంధమనేని జయశంకర్‌ నాయుడు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చిట్టిబాబు నాయుడు, జనసేన ఇన్‌చార్జి పొన్న యుగంధర్‌, బీజేపీ ఇన్‌చార్జి రాజేంద్రన్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంధమనేని రాజశేఖర్‌ నాయుడు, నియోజకవర్గం ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గుండయ్య, బాలాజీ నాయుడు, ఎన్‌.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:57 AM