CM: చంద్రబాబుకు ఘనస్వాగతం
ABN , Publish Date - Mar 21 , 2026 | 02:01 AM
తిరుమల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది.
తిరుపతి/తిరుపతి రూరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన ఉండవల్లి నుంచీ హెలికాప్టర్‌లో బయల్దేరి 6.10 గంటలకల్లా తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ చేరుకున్నారు. అక్కడి నుంచీ రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద ఆయనకు జిల్లా ఇంఛార్జి మంత్రి సత్యప్రసాద్, సీఎం కార్యక్రమాల కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, మురళీమోహన్, వీఎం థామస్, కోనేటి ఆదిమూలం, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తుడా ఛైర్మన్ దివాకరరెడ్డి, టీటీడీ బోర్డు మెంబరు పనబాక లక్ష్మి, మాజీ మంత్రి పరసా రత్నం, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, ఏఎస్ మనోహర్, టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీటీడీ ఈవో రవిచంద్ర, కలెక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ షిమోజీ, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ తదితరులు స్వాగతం పలికినవారిలో వున్నారు. తిరుమలలో సీఎంను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతించారు. మంత్రి నారా లోకేశ్ తన తల్లి భువనేశ్వరి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి హైదరాబాదు నుంచీ సాయంత్రం 6.30 గంటలకు రేణిగుంటలోని విమానాశ్రయం చేరుకున్నారు.
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, పార్టీ నేతలు మహేశ్ యాదవ్, జేబీ శ్రీనివాస్, పులిగోరు మురళీ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం లోకేశ్ తల్లి, కుమారుడితో కలసి తిరుమల వెళ్ళారు.