Crime: నిద్రపోతుండగా చెవి కోసేశారు
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:32 AM
గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి చెవిని కోసేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చిట్టమూరు మండలంలో చోటు చేసుకుంది.
చిట్టమూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి) : గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి చెవిని కోసేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చిట్టమూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... కోగిలి ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి కమతం ఆరు బయట నిద్రిస్తుండగా ఎడమ చెవిని ఎవరో కత్తితో కోసేశారు. కస్తూరయ్యకు మెలకువ వచ్చి చూసుకోగా చెవి తెగిపోయి వేలాడుతోంది. నొప్పి భరించలేక కస్తూరయ్య కేకలు పెట్టడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.