Share News

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:43 AM

మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది.

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి
అనాస్‌ (ఫైల్‌ ఫొటో)

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది. పోలీసుల వివరాల మేరకు.. మదనపల్లె అప్పారావు తోటకు చెందిన అప్సర్‌ బాషా, అలిమాస్‌ దంపతుల కుమారుడు మహ్మద్‌ అనాస్‌(14) స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాలల్లో 8వ తరగతి చుదువుతున్నా డు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులు నవాజ్‌, అమమ్‌తో కలిసి సీటీఎం రోడ్డు సమీపం లోని క్వారీ గుంతలో ఈతకెళ్లాడు. ఈత ఆడుతూ గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు వెళ్లి పెద్దలకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు సంఘటన స్థలం వెళ్లి గాలించారు. అగ్నిమాపక ఎస్‌ఐ శివన్న తన సిబ్బందితో వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో బాలుడిన గుర్తించడం సాధ్యం కాలేదు. సోమవారం ఉదయం గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. కుమారుడి మృతదేహం చూసి తల్లి దండ్రులు తల్లడిల్లిపోయారు. అనంతరం మృతదేహా న్ని మదనపల్లెజిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 01:43 AM