Ex-servicemen: మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:06 AM
విశాఖపట్నం ఐఎన్‌ఎ్‌స సిర్‌కార్స్ నేవల్ బేస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్‌రీచ్ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు.
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఐఎన్‌ఎ్‌స సిర్‌కార్స్ నేవల్ బేస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్‌రీచ్ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు. మాజీ నావికాదళ సైనికుల పెన్షన్లకు సంబంధించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పలు సంక్షేమ పథకాల అమలుపై ఏర్పడుతున్న సమస్యలకు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో నావికాదళ అధికారి కమాండర్ నిఖిల్ దదిచీ, ఎస్పీ యాదవ్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీ రాఘవులు, జిల్లా మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు రామచంద్రయ్య, సభ్యులు రాజన్, రఘుపతి, వెంకట్, సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.