Share News

CM: సీఎం పర్యటనలో స్వల్ప మార్పు

ABN , Publish Date - May 19 , 2026 | 12:36 AM

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం కాకుండా, బుధవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో శాంతిపురం మండలం డుంకుమానపల్లె వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

CM: సీఎం పర్యటనలో స్వల్ప మార్పు
హెలిప్యాడ్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

శాంతిపురం, మే 18 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందు షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాయంత్రం కాకుండా, బుధవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో శాంతిపురం మండలం డుంకుమానపల్లె వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి కడపల్లె పంచాయతీ శివపురంలోని ఇంటికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతరకు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఒంటి గంటకు కడపల్లెలోని ఇంటికి చేరుకుని.. 3.30 గంటలకు హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్తారని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ తుషార డూడీ, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.

23న యాదమరి పీహెచ్‌సీలో సంజీవిని పథకం ప్రారంభించనున్న చంద్రబాబు

యాదమరి, మే 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 23వ తేదీన యాదమరికి రానున్నారు. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. సమీపంలోనే బహరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీతో పాటు చిన్నరెడ్డిపల్లి బస్టాప్‌ వద్ద ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ స్థలాన్ని, బహిరంగ సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్‌తో కలిసి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, డీఎస్పీ వెంకటనారాయణ, ఆర్డీవో శ్రీనివాసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ పార్థసారధి, ఎంపీడీవో వీరేంద్రతో పాటు యాదమరి, బంగారుపాళ్యం, తవణంపల్లె, ఐరాల టీడీపీ మండలాధ్యక్షులు మురార్జీ యాదవ్‌, ధరణి ప్రకాష్‌, వెంకటేష్‌ చౌదరి, హరిబాబు, యాదమరి నేతలు వెంకటేష్‌ రబీ, హేమగిరి, వల్లేరు అమర్‌నాథ్‌ నాయుడు, గుణశేఖర్‌, గోపి గౌడ్‌, మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:36 AM