AgriGold: రెండోరోజూ అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:31 AM
స్థానిక సాయుధ దళం కార్యాలయం(ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్)లో రెండో రోజైన శనివారం కూడా అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కొనసాగింది.
చిత్తూరు అర్బన్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక సాయుధ దళం కార్యాలయం(ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్)లో రెండో రోజైన శనివారం కూడా అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కొనసాగింది. ఎస్‌ఆర్‌పురం, జీడీ నెల్లూరు, పాలసముద్రం మండలాలక బాధితులకు సంబంధించిన ఒరిజనల్ బాండ్లు, నగదు రసీదు, నంబర్లను నిశితంగా పరిశీలించారు. నిర్దేశిత మండలాలతో పాటు ఇతర మండలాల బాధితులు కూడా వచ్చారు. దసరా నేపథ్యంలో ఊళ్లకు వెళ్లాలని ఐరాల, యాదమరి మండలాలతో పాటు ఇతర మండలాల వారు ముందుగానే వచ్చారు. తమ బాండ్లను పరిశీలన ప్రక్రియ చేయించుకుని వెళ్లారు. శనివారం ఒక్క రోజే 33 మంది అగ్రిగోల్డ్ బాధితులు సీఐడీ డీఎస్పీలు భాస్కర్‌రెడ్డి, రంగస్వామిల వద్ద హాజరయ్యారు. శుక్రవారం 18 మంది వచ్చారు. రెండో రోజుల్లో బాండ్ల పరిశీలనకు 51 మంది హాజరయ్యారు. సోమవారం వెదురుకుప్పం, కార్వేటినగరం, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్ మండలాలకు చెందిన వారి బాండ్లను పరిశీలిస్తామని డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు.