Share News

Sand: ట్రాక్టర్లలో తరలిపోతున్న ఇసుక

ABN , Publish Date - Jan 11 , 2026 | 02:19 AM

ఏర్పేడు మండల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.

Sand: ట్రాక్టర్లలో తరలిపోతున్న ఇసుక
పెనుమల్లం- పాపానాయుడుపేట మధ్య స్వర్ణముఖి నదిలో..

ఏర్పేడు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు మండల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. మండల పరిధిలో సుమారు 13 కిలోమీటర్ల మేర స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. ఇందులో పాపానాయుడుపేట, పెనుమల్లం, వికృతమాల ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం పదుల సంఖ్యలో రేణిగుంట, తిరుపతి ప్రాంతాలకు ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి వీఆరోఏలతో నిఘా పెట్టారు. శనివారం మన్నసముద్రం, ఇసుక తాగేలి వీఆర్‌ఏలు నాగరాజు, జగదీష్‌ పెనుమల్లం శివార్లలో రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోగా ఇసుకాసురులు తిరగబడ్డారు. గుడిమల్లం ఆలయ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్డు పనులకు ఇసుక తీసుకెళుతున్నట్లు చెప్పి తప్పించుకుని వెళ్లిపోయారు.

అన్నిశాఖల అధికారులకు లెటర్లు రాశా: భార్గవి, తహసీల్దారు, ఏర్పేడు

పాపానాయుడుపేట, వికృతమాల, పెనుమల్లం ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ఇరిగేషన్‌, మైనింగ్‌, పోలీసుశాఖ అధికారులకు లెటర్లు రాశా. అయినా వారి నుంచి స్పందన రాలేదు. నిత్యం రెవెన్యూ పరిధిలో ఎవరినో ఒకరిని ఆ ప్రాంతంలో నిఘా ఉంచుతున్నాం. అందరి సహకారంతో ఇసుక రవాణాను అరికడతాం.

Updated Date - Jan 11 , 2026 | 02:19 AM