తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థుల మృతి..
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:34 PM
తిరుపతి జిల్లా పుత్తూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరులో ఇవాళ (శుక్రవారం) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పుత్తూరులో ద్రౌపతమ్మ-ధర్మరాజుల ఉత్సవాల సందర్భంగా కె.ఎన్. రోడ్డులోని పూజా టెక్స్‌టైల్స్ వద్ద ఫ్లెక్సీ కట్టేందుకు కొంతమంది విద్యార్థులు గుమిగూడారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తూ 11 కేవీ విద్యుత్ తీగలకు అది తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను విగ్నేష్ (19), గోకుల్ (18)గా గుర్తించారు. వారిద్దరూ స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కుమారుల మృతిచెందడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అక్టోబర్ నాటికి 70 లక్షల టన్నుల చెత్త తొలగింపు పూర్తి: నారాయణ
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష