Infant deaths: శిశు మరణాలపై పీహెచ్‌సీలకు నోటీసులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:09 AM
జిల్లాలో శిశు మరణాలు జరిగితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు.
తిరుపతి సెంట్రల్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శిశు మరణాలు జరిగితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు. తిరుపతిలోని తన కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, అంగన్‌వాడీ వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వెంకటగిరి, ఏర్పేడు, కేవీబీ పురం, నాగలాపురం, బాలాయపల్లి పరిధిలోని జయంపు, కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇటీవల శిశు మరణాలు ఎక్కువగా జరిగాయన్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దాదాపు 10 శిశు మరణాలు జరిగాయని.. ఆయా పీహెచ్‌సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. పీహెచ్‌సీల నుంచి మెటర్నిటీకీ రెఫర్ చేసే సమయంలో గర్భిణులకు అన్నిరకాల పరీక్షలు చేసి, ఎలాంటి లోపాలు ఉన్నాయో గుర్తించి పంపాలన్నారు. డీఐవో శాంతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్ సెల్వియా, గర్భకోశ వ్యాధి నిపుణులు, పీహెచ్‌సీల వైద్యులు, గైనకాలజిస్టు డాక్టర్లు, మెటర్నిటీ, రుయా ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు.