Share News

NEET PG: ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్షలు

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:06 AM

జిల్లాలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నీట్‌-పీజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగింది.

NEET PG: ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్షలు
చిత్తూరులోని ఎస్వీసెట్‌ కేంద్రం వద్ద సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఏఎస్పీ షాను

చిత్తూరు (కలెక్టరేట్‌/అర్బన్‌), ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నీట్‌-పీజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 594 మంది అభ్యర్థులకు గాను 17 మంది గైర్హాజరు కాగా, 577 మంది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రాశారు. చిత్తూరు ఎస్వీసెట్‌లో 150 మందికి గాను 145 మంది, పలమనేరు మదర్‌ థెరిస్సా కాలేజీలో 150 కి 142, కుప్పం ద్రవిడ వర్సిటీలో 80కి 79, కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీలో 214కుగాను 211 మంది హాజరయ్యారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచారు. చిత్తూరులో ఎస్వీసెట్‌ కేంద్రాన్ని ఏఎస్పీ షాను పరిశీలించి పోలీసు అధికారులకు సలహాలు, సూచనలు చేశారు.

Updated Date - Aug 31 , 2026 | 01:07 AM