Share News

Sugars: సూదలగుంట షుగర్స్‌ బకాయిల చెల్లింపునకు చర్యలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:23 AM

బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని సూదలగుంట(మయూరి) షుగర్స్‌ రెండు యూనిట్లకు సంబంధించి రైతులకు, రవా ణా కాంట్రాక్టర్లకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన ఇప్పించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Sugars: సూదలగుంట షుగర్స్‌ బకాయిల చెల్లింపునకు చర్యలు
చెరకు రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని సూదలగుంట(మయూరి) షుగర్స్‌ రెండు యూనిట్లకు సంబంధించి రైతులకు, రవా ణా కాంట్రాక్టర్లకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన ఇప్పించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ రైతులకు హామీ ఇచ్చారు. ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి బకాయిల అంశం పై కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్షించారు. 2018-19 క్రషింగ్‌ సీజన్‌కు సంబంఽధించి రూ.30కోట్ల మేర రైతులకు బకాయి ఉండగా... నాలుగేళ్ల క్రితం సూదలగుంట షుగర్స్‌ కంపెనీకి చెందిన106 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించి రూ.15కోట్ల మేర చెల్లించినట్లు గుర్తు చేశారు. ఇంకా రూ.27కోట్ల మేర బకాయిలు చెల్లించేందుకు నెల్లూరు జిల్లా లో ఉన్న ఆ సంస్థ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేస్తామని, అలాగే బుచ్చినాయుడు కండ్రిగలో జప్తు చేసిన 43ఎకరాల భూమికి కూడా వేలం నిర్వహించి రైతులకు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హా మీ ఇచ్చారు. బకాయి వసూళ్లకు సంబంధించి నమోదయిన చెక్‌ బౌన్స్‌ కేసుల్లో నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌కు సంబంధించి కఠిన చర్యలు చేపడుతామని ఎస్పీ సుబ్బరాయుదు తెలిపారు.డిప్యూటీ కేన్‌ కమిషనర్‌ జాన్‌ విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 01:23 AM