Share News

Leopard: ఎస్వీయూలో చిరుత కలకలం

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:22 AM

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

Leopard: ఎస్వీయూలో చిరుత కలకలం
చెట్ల మధ్య చిరుత

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఐబ్లాక్‌ హాస్టల్‌ సమీపంలో చిరుత కనిపించింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు వర్సిటీ సెక్యూరిటీ అధికారి మోహన్‌ తెలియజేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. చిరుత ఉనికిని గుర్తించారు. అయితే అది అక్కడినుంచి వెళ్లిపోయింది. అయినా విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రిపూట ఎవరూ బయట సంచరించవద్దని హెచ్చరించారు.

Updated Date - Jun 13 , 2026 | 01:22 AM