GSLV-F17: ‘జీఎ్‌సఎల్వీ-ఎఫ్17’ ప్రయోగం
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:29 AM
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ఽథావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చే నెలలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు.
సూళ్లూరుపేట, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ఽథావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చే నెలలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈవోఎస్-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం మంగళవారం షార్‌లో జరగనుంది. ఈ సమావేశంలో షార్ డైరెక్టర్ ముత్తు చెళియన్‌తోపాటు పలువురు శాస్త్రవేత్తలు సమావేశమై ప్రయోగంపై చర్చించనున్నారు. అనంతరం ప్రయోగ తేదీ, సమయం అధికారికంగా వెల్లడించనున్నారు. ఎంఆర్‌ఆర్ తర్వాత అదేరోజున లేక మరుసటి లాంచింగ్ ఆథరైజేషన్ (లాబ్) బోర్డు వారు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత ఇవ్వనున్నారు.