Share News

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:40 AM

మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ
ఉత్సవమూర్తులను శయన మందిరానికి తీసుకొస్తున్న ఆలయ ఛైర్మన్‌,ఈవో తదితరులు (ఇన్‌సెట్లో) పల్లకిలో ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఏకాంతసేవ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.ఆలయం మూసివేత సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో కూర్చోబెట్టి హారతి ఇచ్చారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని అదే పల్లకీలో ఉంచి అమ్మవారి శయన మందిరం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అమర్చిన పడక ఊయలలో స్వామి అమ్మవార్లను ఉంచి ఊయల ఊపుతూ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్ర పఠనం తరువాత స్వామి, అమ్మవార్లను ఏకాంతంగా వదిలి అర్చకులు, భక్తులు వెలుపలకు వచ్చి తలుపులు మూయడంతో ఏకాంతసేవ ముగిసింది.ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా వేద పారాయణ సభ జరిగింది.

Updated Date - Feb 23 , 2026 | 02:40 AM