Share News

Surgeons:సరికొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:31 AM

సరికొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టాలని యువ సర్జన్లకు ఆలిండియా సర్జన్ల సంఘ జాతీయ అధ్యక్షుడు ముత్తు పాండియన్‌ సూచించారు.

Surgeons:సరికొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టండి
రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన సర్జన్లు

తిరుపతి సెంట్రల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సరికొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టాలని యువ సర్జన్లకు ఆలిండియా సర్జన్ల సంఘ జాతీయ అధ్యక్షుడు ముత్తు పాండియన్‌ సూచించారు. తిరుపతిలోని శ్రీకన్వెన్షన్‌ సెంటర్‌లో మూడ్రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్ల ఆఫ్‌ ఇండియా ఏపీ చాప్టర్‌ సదస్సు గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ముత్తు పాండియన్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు పెద్ద కోతతో నిర్వహించాల్సిన అనేక శస్త్రచికిత్సలు ప్రస్తుతం చిన్న రంధ్రాల ద్వారా అధునాతన పరికరాల సాయంతో నిర్వహించే స్థాయికి వైద్య రంగం చేరిందన్నారు. సర్జన్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు, రోబోటిక్‌ సర్జరీలతో రోగులకు కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తులో సర్జన్ల పాత్ర.. వంటి అంశాలపై నిపుణులు చర్చించాలన్నారు. తొలి రోజున దాదాపు 1200మందికిపైగా సర్జన్లు హాజరయ్యారు. ప్రముఖ యూరాలజీ ప్రొఫెసర్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యంను సత్కరించగా, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి డాక్టర్‌ జీవీ రావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డాక్టర్‌ బలరామరాజు, కోశాధికారి రమేష్‌ రెడ్డి, డాక్టర్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 01:31 AM