Share News

Collector: అలాంటి పరిశ్రమలకూ రుణాలు ఇప్పించండి

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:26 AM

‘జిల్లాలో చాలా మంది ఔత్సాహికులు డీకేటీ భూముల్లోనూ చిన్నస్థాయి పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వారికి కూడా పారిశ్రామిక రుణాల్ని మంజూరు చేస్తే, ప్రోత్సహించినట్లు అవుతుంది’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సీఎం చంద్రబాబును కోరారు.

Collector: అలాంటి పరిశ్రమలకూ రుణాలు ఇప్పించండి
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సుమిత్‌కుమర్‌

చిత్తూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో చాలా మంది ఔత్సాహికులు డీకేటీ భూముల్లోనూ చిన్నస్థాయి పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వారికి కూడా పారిశ్రామిక రుణాల్ని మంజూరు చేస్తే, ప్రోత్సహించినట్లు అవుతుంది’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సీఎం చంద్రబాబును కోరారు. గురువారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సుమిత్‌కుమార్‌ ఈ విషయంగా మాట్లాడారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాయలసీమలో ‘సర్‌’పై దృష్టి సారించాలని, అనుమతులు లభించిన పరిశ్రమలు గ్రౌండ్‌ అయ్యేలా చూడాలని ఆదేశించారు. శుక్రవారం కూడా రెండో రోజు సదస్సు జరగనుంది.

Updated Date - Sep 11 , 2026 | 01:26 AM