Birds: ముగిసిన పక్షుల గణన
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:42 AM
తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ఆదివారం ముగిసింది.గరుడ అట్లాస్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.
ఏర్పేడు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ఆదివారం ముగిసింది.గరుడ అట్లాస్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.2022లో మొదలైన ఈ కార్యక్రమంలో పక్షుల వైవిధ్యంపై అధ్యయనం నాలుగు సార్లు జరిగింది.తిరుపతి పరిసరాల్లో 274 పక్షి జాతులను గుర్తించారు. ఫిబ్రవరి 20 నుంచి మొదలైన ఐదో విడత పక్షులగణనలో 192 జాతులను నమోదు చేశారు.తిరుపతి పక్షుల సంఖ్య, వాటి ఆవాసాల్లో వస్తున్న మార్పులను పర్యవేక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.నగరాభివృద్ధి, భూ వినియోగ మార్పుల వల్ల పక్షులపై పడే ప్రభావాన్ని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ హితమైన నగర ప్రణాళికలు రూపొందించవచ్చు. పక్షుల ధోరణులను ఎప్పటికపుడు గమనిస్తూ పౌర విజ్ఞానాన్ని ప్రోత్సహించవచ్చు.ఐసర్‌లోని డాక్టర్ రాబిన్ ల్యాబ్ ఈ పక్షుల గణనకు సాంకేతిక సహకారంతో పాటు డేటా ప్రోటోకాల్ అందించింది. ఐసర్ నుంచి హరీష ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచగా టీఎన్‌ఎ్‌స నుంచి ఎస్.పుష్యమిత్ర, రామచంద్రారెడ్డి సహకారం అందించారు.