Share News

Counterfeit: నాయుడుపేటలో రూ.200 దొంగనోట్లు

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:39 AM

నాయుడుపేట పట్టణంలోని దుకాణాల్లో 200 రూపాయల దొంగనోట్లు కనిపించడంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Counterfeit: నాయుడుపేటలో రూ.200 దొంగనోట్లు

నాయుడుపేట టౌన్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): నాయుడుపేట పట్టణంలోని దుకాణాల్లో 200 రూపాయల దొంగనోట్లు కనిపించడంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం ముందురోజున పలు దుకాణాల వద్ద రద్దీగా ఉండటంతో ఓ పూల దుకాణం వద్ద మూడు 200 రూపాయల దొంగనోట్లను దుకాణదారుడు గుర్తించాడు. వారం రోజులుగా పలు దుకాణాల వద్దా రూ.200 దొంగనోట్లు వస్తున్నట్లు దుకాణదారులు చెబుతున్నారు. పోలీసులు నిఘాపెట్టి.. వీటిని నియంత్రించాలని కోరుతున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 01:39 AM